Friday, March 29, 2024

ఆకట్టుకుంటున్న ‘పెళ్లిసందD’ మూవీ టీజర్

శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా తెరకెక్కిన ‘పెళ్లి సందD’ మూవీ టీజర్‌ను మంగళవారం నాడు చిత్ర యూనిట్ విడుదల చేసింది. లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సినిమాను నిర్మించారు. గౌరీ రోనంకి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ వహించడమే కాకుండా, ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు.

ఈ సినిమాతో కథానాయికగా శ్రీలీల తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్ డేట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, పోసాని ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీకాంత్ కి మాదిరిగానే ఆయన తనయుడికి కూడా ‘పెళ్లి సందD’ సినిమా హిట్ ఇస్తుందేమో చూడాలి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement