Saturday, March 25, 2023

హీరోగా అరంగేట్రం చేస్తున్న‌సుమ‌, రాజీవ్ కుమారుడు

‘క్షణం’, ‘కృష్ణ అండ్‌ హిస్‌ లీల’ లాంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు రవికాంత్‌ పేరేపు. మహేశ్వరి మూవీస్‌ బ్యానర్‌లో కొత్త చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల, నటు-డు రాజీవ్‌ కనకాల కుమారుడు రోషన్‌ కనకాల ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని పి విమల నిర్మిస్తున్నారు. రోషన్‌ కనకాల పుట్టినరోజు సందర్భంగా, చిత్ర బృందం డిజెగా వైబ్రెంట్‌ అవతార్‌లో పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్‌లో రోషన్‌ గిరజాల జుట్టు-, సన్‌ గ్లాసెస్‌తో, ఉఓ సిస్టమ్‌లో మ్యూజిక్‌ ప్లే చేస్తూ హెడ్‌సెట్‌ ధరించి కనిపించారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం న్యూ ఏజ్‌ రోమ్‌-కామ్‌గా రూపొందుతోంది. శ్రీచరణ్‌ పాకాల సంగీతం, నవీన్‌ యాదవ్‌ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement