Thursday, April 25, 2024

బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపేస్తున్న చిన్న బడ్జెట్ సినిమాలు.. ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న రోమంచం

చిన్న బడ్జెట్ సినిమానే అయిన బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసింది మలయాళ సినిమా రోమంచం. నూతన దర్శకుడు జిత్తు మాధవన్‌ దర్శకత్వం వహించిన ఈ హార్రర్ కామెడీ మూవీ బెంగుళూరులో స్పిరిట్ బోర్డుని ఉపయోగించిన ఏడుగురు బ్యాచిలర్లకు జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన సినిమా. శౌబిన్ షాహిర్, అర్జున్ అశోకన్, చెంబన్ వినోద్ జోస్, అనంతరామన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమా థియేట్రికల్ రన్‌ను బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూలు చేసింది. కాగా, ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడి అయింది. వచ్చే నెల (ఏప్రిల్) 7న ప్రముక ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ కు రెడీగా ఉంది. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అయితే, ఇతర భాషల వెర్షన్‌ల గురించి ఇంకా సమాచారం లేదు.
ఈ సినిమాని జాన్‌పాల్ జార్జ్, సౌభిన్ షాహిర్, గిరీష్ గంగాధరన్ కలిసి నిర్మించారు. ఈ కామెడీ హారర్ చిత్రాన్ని చూడాలనుకునే వారు ఏప్రిల్ 7 నుండి హాట్‌స్టార్‌లో చూడవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement