Friday, April 19, 2024

పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న రాకింగ్ రాకేశ్.. జోర్దార్ సుజాత‌

ఎట్ట‌కేల‌కు త‌మ ప్రేమ‌ని పెళ్ళి బంధంగా మార్చుకోనున్నారు రాకింగ్ రాకేశ్.. జోర్దార్ సుజాత. ఈ జంట తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ బంధాన్ని మరో స్టేజ్ కి తీసుకెళ్లేందుకు రెడీగా ఉన్నట్లు ప్రకటించింది. దీనికి ఇరువురు కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు సుజాత-రాకేశ్. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నామని శుభవార్త చెప్పారు.
జోర్దార్ సుజాత తన యూట్యూబ్ ఛానెల్ అయిన సూపర్ సుజాత ఛానెల్ లో ఈ గుడ్ న్యూస్ ను తన సబ్ స్క్రైబర్లతో పాటు అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ వీడియోలో రాకింగ్ రాకేశ్ తో తన పరిచయం.. ఆ తర్వాత స్నేహం.. అది ప్రేమకు దారి తీయడం.. ఇరు కుటుంబాలు కలుసుకోవడం.. చివరకు వీళ్ల బంధం పెళ్లి వరకు రావడం గురించి.. అంతా వివరించింది.
ఈనెల చివరిలో రాకేశ్-సుజాత నిశ్చితార్థం ఉండనుంది. అదే రోజున లగ్నపత్రిక రాసుకుని పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుంటారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement