Wednesday, April 17, 2024

RRR నుంచి కీలక అప్‌డేట్.. ఈనెల 15న ‘రోర్ ఆఫ్ RRR’

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీ RRR. ఈ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ రానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటన చేసింది. ఈ నెల 15న ఉదయం 11 గంటలకు ‘రోర్ ఆఫ్ RRR’ పేరుతో మేకింగ్ వీడియోను విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేసింది. కాగా బాహుబలి వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అక్టోబర్ 13న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ వార్త కూడా చదవండి: బాలయ్య లైనప్‌లో మరో డైరెక్టర్

Advertisement

తాజా వార్తలు

Advertisement