Monday, March 27, 2023

Road Accident: అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన కారు… త‌ల్లీకొడుకు మృతి

కారు డివైడ‌ర్ ను ఢీకొని త‌ల్లీకొడుకు మృతి చెందిన ఘ‌ట‌న నల్లగొండ జిల్లాలోని కేతేపల్లి మండలంలో చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున మండ‌లంలోని ఇనుపాముల వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. కారు ఒక్క‌సారిగా బోల్తాపటంతో కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్ర‌మాదంలో కారులో ఉన్న త‌ల్లీకొడుకులు అక్కడికక్కడే మ‌ర‌ణించ‌గా.. మరో ఇద్దరు గాయపడ్డారు. వెంట‌నే స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలను తెలుసుకున్నారు. మంటలను అదుపుచేసి బాధితులను కారులోనుంచి బయటకు తీశారు. అనంత‌రం క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతిచెందిన వారిని తల్లి కరుణ, కుమారుడు ఫణికుమార్‌గా గుర్తించారు. బాధితులంతా సూర్యాపేట వాసులని పోలీసులు చెప్పారు. హైదరాబాద్‌ నుంచి సూర్యాపేట వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement