Tuesday, September 21, 2021

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అచ్చ‌పేట మండ‌లం చెన్నారం గేట్ స‌మీపంలో హైద‌రాబాద్ – శ్రీ‌శైలం ర‌హ‌దారిపై రెండు కార్లు ఒక‌దానినొక‌టి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు వ్య‌క్తులు మృతిచెందారు. ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌మాద ధాటికి కార్లు నుజ్జునుజ్జ‌య్యాయి. మృత‌దేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా ప‌డిపోయాయి. క్షతగాత్రులను హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు ఫోన్ చేసి సంఘటన పూర్వాపరాలను తెలుసుకున్నారు. తక్షణమే క్షతగాత్రులను సమీప మేరుగైన వైద్య సేవలందేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేను సీఎం ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News