Thursday, April 25, 2024

దర్శకేంద్రుడి నివాసంలో విషాదం

ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు నివాసంలో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు, ప్రముఖ నిర్మాత కోవెలమూడి కృష్ణమోహన రావు (81) కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కాగా కృష్ణ మనోహర్ రావుకు ఇద్దరు కుమార్తెలు. గురువారం నాడు ఫిలింనగర్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా ఆర్కే ఫిలిమ్స్ బ్యానరుపై కృష్ణమోహనరావు పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement