Thursday, April 25, 2024

దూసుకెళ్తోన్న జింతాక్ సాంగ్.. వంద మిలియ‌న్ ప్ల‌స్ వ్యూస్

హీరో ర‌వితేజ న‌టించిన ధ‌మాకా చిత్రంలోని జింతాక్ సాంగ్ దూసుకుపోతోంది.ఈ పాట వంద మిలియ‌న్ ప్ల‌స్ వ్యూస్ ని రాబ‌ట్టింది. ఈ సినిమాలోని పాటల్లో ‘జింతాక్’ అనే పాట బాగా పాప్యులర్ అయింది. జనంలోకి ఒక రేంజ్ లోకి దూసుకుపోయిన మాస్ పాటగా మార్కులు కొట్టేసింది. అలాంటి ఈ పాట 100 మిలియన్ ప్లస్ వ్యూస్ ను రాబట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను అధికారికంగా రిలీజ్ చేశారు. కాసర్ల శ్యామ్ సాహిత్యంలో మంచి ఛమక్కులు వినిపిస్తాయి. అలాగే భీమ్స్ ఇచ్చిన బీట్ కూడా ఆకట్టుకుంటుంది. కాస్ట్యూమ్స్ … కలర్ఫుల్ సెట్ .. కొరియోగ్రఫీ ఇలా అన్నీ కుదిరిన పాట ఇది. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా శ్రీలీల అలరించింది. భీమ్స్ సంగీతం ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement