Thursday, April 18, 2024

పెరిగిన బంగారం ధరలు…తగ్గిన వెండి

బంగారం ధరలు గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా మరోసారి బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ ధరల ప్రకారం… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 44,900 కి చేరింది.

అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 పెరిగి రూ. 48,990 కి చేరింది. మరోవైపు వెండి ధరలు మాత్రం భారీగా తగ్గి పోయాయి. కిలో వెండి ధర రూ.4200 తగ్గి 67,200 కు చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement