Friday, February 3, 2023

సంక్రాంతి స్పెష‌ల్ – రిషి స‌న‌క్ అరిటాకు విందు (వీడియోతో)

లండ‌న్ – బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వచ్చిన తొలి పొంగల్‌ను రిషి సునాక్‌ ఘనంగా జ‌రుపుకున్నారు. .భార‌తీయ సంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో నిర్వ‌హించిన ఈ సంక్రాంతి వేడుక‌ల‌కు పీఎం ఆఫీస్ సిబ్బందితోపాటు డిఫెన్స్ సిబ్బందిని త‌న ఇంటికి ఆహ్వానించారు.. వారికి పూర్తి భారతీయ పద్ధతిలో వారికి భోజనలను ఏర్పాటు చేశారు. అరటి ఆకులపై సంక్రాంతి పసందైన పిండి వంటలతో భోజనం వడ్డించారు. రిషి స‌తీమ‌ణి అక్ష‌తా మూర్తి వ‌చ్చిన అతిథుల‌కు వంట‌కాల‌ను కొసరి కొస‌రి వ‌డ్డించారు.. అరటి ఆకులో పప్పు, అన్నం, సాంబాపర్, ఆరటి పండుతోపాటు చివరికి పెరుగును కూడా అందించారు. వారంత భారతీయ సాంప్రదాయ పద్ధతిలో అరటి ఆకుపై భోజనాన్ని ఆస్వాధించారు. స్పూన్లు, ఫోర్కులు కాకుండా చేతులతో ఆహారాన్ని తీసుకోవడం చాలా వెరైటీ కనిపించింది. చేతులతో ఆహారాన్ని తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement