Friday, December 6, 2024

RIP – స‌మంతకు పితృ వియోగం…

స్టార్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మృతి చెందారు. ఈ విషయాన్ని సమంత తన ఇన్‌స్టా స్టోరీలో తెలియజేశారు. ‘నాన్నను ఇక కలవలేను’ అంటూ ఆమె హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేశారు. దీంతో సమంతకు అభిమానుల, సెలబ్రిటీలు సానుభూతిని తెలియజేస్తూ.. ఈ సమయంలో ధైర్యంగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, చెన్నైలో జోసెఫ్ ప్రభు, నీనెట్ ప్రభు దంపతులకు సమంత జన్మించారు. ఆమె తండ్రి, తెలుగు ఆంగ్లో-ఇండియన్. సమంత జీవితంలో ఆమె తండ్రి ముఖ్య పాత్ర పోషించారని గతంలో ఎన్నోసార్లు ఆమె చెప్పుకొచ్చింది. తనకు ప్రతి క్షణం తన తండ్రి అండగా, మద్దతుగా నిలిచారని తెలిపింది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మరణవార్త తెలియడంతో సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తూ.. జోసెఫ్ ప్రభు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement