Tuesday, July 27, 2021

రైతులకు రూ.60 కోట్లు పంగనామం పెట్టిన రైస్ మిల్లర్

విజయవాడకు చెందిన రైస్ మిల్లర్ విశ్వనాథం ఏపీ, తెలంగాణ జిల్లాలకు చెందిన పలువురు రైతులకు రూ.కోట్లలో డబ్బులు ఎగ్గొట్టాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పల్లవి రైస్ మిల్లర్ విశ్వనాథం ఏపీలోని తూ.గో., ప.గో., నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలతో పాటు తెలంగాణలోని సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు చెందిన రైతులకు భారీగా డబ్బులు ఇవ్వాల్సి ఉందని తెలుస్తోంది.

బాధిత రైతులకు రైస్ మిల్లర్ సుమారు రూ.60 కోట్ల నుంచి రూ.65 కోట్ల వరకు చెల్లించాల్సి ఉన్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు రైతులు విజయవాడలోని విశ్వనాథం ఇంటికి చేరుకుంటున్న నేపథ్యంలో.. అతడి ఇంటికి తాళం వేసి ఉండటంతో ఏం చేయాలో అర్థం కాక రైతులు అయోమయానికి గురవుతున్నారు.

ఇది కూడా చదవండి: బ్యాంకులకు రూ.200 కోట్లు ఎగ్గొట్టిన నిందితుడి అరెస్ట్

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News