Tuesday, July 27, 2021

రేవంత్ రెడ్డి హౌజ్ అరెస్ట్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆయన ఇంటి ముందు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. అయితే పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు హ‌జ‌ర‌య్యేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ల‌నున్న స‌మ‌యంలో రేవంత్ రెడ్డి ఇంటి ముందు భారీగా పోలీసులు ఉండ‌టం అనేక అనుమానాల‌కు దారితీస్తుంది.

పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు వెళ్లి, అక్క‌డే హోంమంత్రి అమిత్ షాకు, ప్ర‌ధానికి ఫిర్యాదు చేస్తాన‌ని… విచార‌ణ‌కు ఆదేశించాల‌ని కోరుతాన‌ని హెచ్చ‌రించారు. ఇంట‌లిజెన్స్ ప్ర‌భాక‌ర్ రావు, సీఎస్ సోమేష్ కుమార్ ల అవినీతి అంశాల‌ను కూడా రేవంత్ రెడ్డి ప్ర‌స్తావిస్తాన‌ని చెప్పిన రెండ్రోజుల‌కే రేవంత్ రెడ్డి ఇంటి ముందు భారీగా పోలీసు బ‌లగాలు మొహ‌రించారు. రేవంత్ రెడ్డిని ఢిల్లీ వెళ్ల‌కుండా అడ్డుకునేందుకే పోలీసులు వ‌చ్చార‌ని రేవంత్ సన్నిహితులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News