Tuesday, November 28, 2023

విప్లవాత్మకంగా టీఎస్‌బీపాస్, సింగిల్‌ విండో పద్ధతిలో లే అవుట్‌లు, భవననిర్మాణ అనుమతులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బిల్డింగ్‌ ప్లాన్‌ లే అవుట్‌, ఆక్యుపెన్సీ, భూ వినియోగం మార్పు తదితర నిర్మాణపరమైన అనుమతులకు సులభరతం, పారదర్శకం చేయుటకు తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌బీపాస్‌ వంటి విప్లవాత్మక చర్యలు చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం 2020 సెప్టెంబర్‌లో టీఎస్‌బీపాస్‌ చట్టం తెచ్చింది. ఇది పట్టణాలలో లే అవుట్‌లు,భవనాల అనుమతులను త్వరగా ఇవ్వడానికి అనధికారిక లే అవుట్‌లు, అక్రమ నిర్మాణాలను నియంత్రించే ఉద్దేశంతో తీసుకువచ్చారు. పలుశాఖల నుంచి నిర్మాణ, ఇతర అనుమతుల కొరకు ప్రజలు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో సంబంధిత డాక్యుమెంట్‌లను టీఎస్‌బీపాస్‌ వెబ్‌సైట్‌కు సింగిల్‌ విండో పద్ధతిలో అప్‌లోడ్‌ చేస్తే నిర్దేశిత సమయంలోపు ఆయా ధ్రువీకరణలు, అనుమతులు జారీ అవుతాయి.

రాష్ట్రంలోని 142 పురపాలికల్లో ఇప్పటివరకు టీఎస్‌బీపాస్‌లో భాగంగా 1లక్ష34వేల327 దరఖాస్తులను పరిష్కరించనట్లు పురపాలక శాఖ తెలిపింది. 75 చదరపు గజాలపైన, ఎత్తు 7 మీటర్ల వరకు గల జిప్లస్‌వన్‌ వరకు గల నివాసాలకు టీఎస్‌బీపాస్‌లో అనుమతిస్తున్నారు. 75 గజాల నుంచి 600 చదరపు గజాల వరకు 10 మీటర్ల ఎత్తు ఉన్న నివాస నిర్మాణాలకు తక్షణ అనుమతిస్తున్నారు. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న అన్ని నివాస భవనాలు, నివాసేతర భవనాలు, అపార్ట్‌మెంట్లు, మల్టిdప్లెక్స్‌, లే అవుట్‌లకు సింగిల్‌ విండో పద్ధతిలో అనుమతిస్తున్నారు. తాత్కాలిక లే అవుట్‌, తుది లే అవుట్‌ల ఆమోదం ప్రస్తుతం సంబంధిత జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని జిల్లా లే అవుట్‌ అప్రూవల్‌ కమిటీ ప్రాసెస్‌ చేస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 28వేల757, హెచ్‌ఎండీఏ41643,డీటీసీపీ పరిధిలో 63927 భవన, లే అవుట్‌ అనుమతులను టీఎస్‌బీపాస్‌లో భాగంగా ఇచ్చారు.

- Advertisement -
   

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement