Saturday, November 9, 2024

TG | సీఎం హోదాలో సొంతూరులో రేవంత్‌ పర్యటన.. గ్రామ‌స్తుల ఘన స్వాగ‌తం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : సీఎ రేవంత్‌రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పర్యటిస్తున్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని జ‌రిగే వేడుకల్లో పాల్గొంటున్నారు. సీఎం హోదాలో రేవంత్ తొలిసారి తన స్వగ్రామానికి వచ్చారు.

ముఖ్యమంత్రికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. పూల జల్లులు, డప్పు దరువులు, కోలాటాలతో ఆహ్వానించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. రూ.18 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అంతర్గత రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.32 లక్షలతో చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్‌కు శంకుస్థాపన చేశారు.

రూ.55 లక్షలతో నిర్మించిన యాదయ్య స్మారక గ్రంథాలయాన్ని ప్రారంభించారు. రూ.64 లక్షలతో ఆధునిక బస్టాండ్, సెంట్రల్ లైటింగ్‌ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. రూ.70 లక్షలతో నిర్మించిన బీసీ కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. రూ.18 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement