Saturday, December 7, 2024

TG | రేవంత్.. పిచ్చి ప్రగల్బాలు మాని పాలనపై దృష్టి పెట్టు : హరీష్

తప్పు మీద తప్పు చేసే రేవంత్ ప్రవర్తనను అందరూ గమనిస్తున్నారు. తెలంగాణ కోసం పోరాడిన మహానుభావుడు మీ తండ్రి వయసులో ఉన్న కేసీఆర్‌పై నీ పుట్టిన రోజున చేసిన నీచమైన వ్యాఖ్యలు అత్యంత హేయం అని మండిప‌డ్డారు. కేసీఆర్‌ తెలంగాణ సాధించని పక్షంలో మీరు సీఎం అయ్యేవారా అని హరీష్‌ రావు ప్రశ్నించారు.

రేవంత్‌ రెడ్డి మూసీ పాదయాత్ర హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ మురికి కూపంగా మారడానికి 50 ఏండ్ల కాంగ్రెస్‌ పాలన కారణం కాదా అని ప్రశ్నించారు. పాదయాత్ర కాదు, పాప పరిహారయాత్ర చేసినా మీ కాంగ్రెస్‌ పార్టీ పాపం పోదన్నారు. పేదల గూడు కూల్చింది ఒక దగ్గర, పాదయాత్ర చేసేది మరొక దగ్గరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో ఇండ్లు కూల్చి, నల్లగొండలో పాదయాత్ర చేస్తారా అని నిలదీశారు. దమ్ముంటే.. హైదరాబాద్‌ నుంచి పాదయాత్ర మొదలు పెట్టాలని సవాల్‌ విసిరారు. మీ పాదయాత్రకు ప్రజల మద్దతే ఉండి ఉంటే, ఈ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు ఎందుకని రేవంత్‌ రెడ్డిని నిలదీశారు. మీ 11 నెలల పాలనే కాదు, మీ పాదయాత్ర కూడా నిర్బంధాల మధ్య కొనసాగుతుండడం దురదృష్టకరమంటూ విమర్శించారు. అరెస్టులు, అక్రమ నిర్బంధాలు చేసిన బీఆర్‌ఎస్‌ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

‘‘నీ లాగా వికృతంగా మాట్లాడే ముఖ్యమంత్రిని ఈ దేశం ఎప్పుడూ చూసి ఉండదు.. మూసీ నీళ్ళ మురికితో కడిగినా నీ నోరు మురికి పోదు. నీ వంకర బుద్ధి ఇగ మారదు. నీ లాగా చిల్లరగా మేము మాట్లాడలేము. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని, అభివృద్ధి పథంలో నడిపిన గంభీరమైన చరిత్ర మాది. బ్యాగులు మోసి, బ్యాగులు పంచి అడ్డ తోవన అధికారంలోకి వచ్చిన నీచ చరిత్ర నీది. నీ దోపిడిని, నీ దొంగబుద్ధిని నిరూపించి ప్రజా క్షేత్రంలోనే నీకు బుద్ధి చెబుతం. పిచ్చి ప్రగల్బాలు మాని పరిపాలన మీద దృష్టి పెట్టు. నిరంకుశత్వం మాని నిర్మాణాత్మక నిర్ణయాలపై శ్రద్ద వహించు.’’ అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement