Friday, April 19, 2024

స్వల్పంగా తగ్గిన రిటైల్‌ ద్రవ్యోల్బనం

వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. జనవరిలో 6.52 శాతంగా నమోదైన రిటైల్‌ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 6.44 శాతంగా నమోదైంది. గత సంవత్సరం ఫిబ్రవరిలో ఇది 6.07 శాతంగా ఉంది. ఈ వివరాలను కేంద్ర గణాంక కార్యాలయం విడుదల చేసింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం గ్రామీన ప్రాంతాల్లో 6.72 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో 6.10 శాతంగా నమోదైంది. జనవరిలో 6 శాతంగా ఉన్న ఆహార పదార్ధాల ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 5.95 శాతానికి తగ్గింది.


ఫిబ్రవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణ తగ్గినప్పటికీ రిజర్వ్‌ బ్యాంక్‌ పెట్టుకున్న టార్గెట్‌ కంటే ఎక్కువగానే ఉంది. 2022 జనవరి నుంచి ఆర్బీఐ పెట్టుకున్న 6 శాతానికి పైగానే ఇది నమోదవుతూ వస్తోంది. ఆర్బీఐ పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు పలు దఫాలుగా వడ్డీ రేట్లను పెంచుతూ వస్తోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరిలో 25 బేసిస్‌ పాయింట్లు పెంచింది.

మరోసార ఇదే స్థాయిలో వడ్డీ రేట్లు పెంచవచ్చని భావిస్తున్నారు. ఆర్బీఐ ఇప్పటి వరకు 250 బేసిస్‌ పాయింట్ల రెపోరేటు పెంచింది. ఏప్రిల్‌లో మరోసారి ఆర్బీఐ ఎంసీసీ సమావేశం జరగనుంది. ఇందులో మరోసారి 25 బేసిస్‌ పాయింట్ల వరకు వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో బెంచ్‌ మార్క్‌ వడ్డీ రేటు 6.75 శాతానికి పెరిగే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement