Thursday, April 25, 2024

క‌ళాత‌ప‌స్వీ న‌టులంద‌రికీ గురువు.. అల్లు అర్జున్

లెజెండరీ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్ క‌న్నుమూశారు.. కాగా ట్విట్ట‌ర్ లో సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు స్టార్ హీరో అల్లు అర్జున్. తాను ఎప్పటికీ ఎంతగానో అభిమానించే గొప్ప దర్శకుల్లో కే విశ్వనాథ్‌ ఒకరన్నారు అల్లు అర్జున్. ఆయన ప్రతీ నటుడికి గురువు లాంటి వారు. కళాతపస్వి మనల్ని వదిలివెళ్లినా ఆయన అందించిన ఆణిముత్యాల్లాంటి సినిమాలతో చిరస్థాయిగా గుర్తుండిపోతార‌ని అన్నారు. గురూజీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. అని సంతాప సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు అల్లు అర్జున్‌.కే విశ్వనాథ్‌ను కలిసిన సమయంలో దిగిన ఫొటోను అల్లు అర్జున్ ట్విట్టర్‌లో షేర్ చేస్తూ సంతాపం తెలియజేశారు.లెజెండరీ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్ మృతి పట్ల యావత్‌ సినీ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement