Saturday, April 20, 2024

జ‌లాశ‌యాలు నిండినై.. నీటి విడుద‌ల‌కు ఎదురుచూస్తున్న రైతులు..

కర్నూలు, (ప్రభ న్యూస్‌) : జిల్లాలో జలాశయాల్లో ప్రస్తుతం నీటి ప్రవాహం అధికంగా ఉన్నా రబీ రైతులకు నీటి విడుదలకు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వెలుగోడు జలాశయంలో 14300 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, శ్రీశైలంలో 127.770 టీఎంసీలు, గోరుకల్లులో 10500, అవుకుల 3724, గాజులదిన్నెలో 4250, తుంగభద్రలో 100 టీఎంసీల నీరు నిల్వఉంది. కడప, కర్నూలు కాల్వ ఆయకట్టులో రభీ సాగుచేసిన అన్నదాతలకు నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు.

కెసి కాల్వ కింద జిల్లాలో 92వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని, తుంగభద్ర జలాశయంలో కేసీ నీటి వాటా 10 టీఎంసీలు, అందులో అనంతపురంకు 4 టీఎంసీలు తరలించగా, తెలంగాణ పరిధిలోని ఆర్‌డీఎస్‌ ద్వారా 6 టీఎంసీల వాటాతో కలిసి 12 టీఎంసీల నీటిని ఇవ్వాల్సి ఉంది. సంవృద్ధిగా జిల్లాలో జలాశయాల్లో నీరు ఉన్నప్పటికీ రబీలో కేసీ కింద సాగుచేసిన అన్నదాతలకు నీటిని విడుదల చేయలేదు. ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement