Wednesday, April 24, 2024

పదేపదే రైళ్ల రద్దు.. ప్రయాణీకులను ఇబ్బంది పెట్టి మరీ విస్తరణ పనులు

అమరావతి,ఆంధ్రప్రభ: గత నెల రోజుల నుండి దక్షిణ మధ్య రైల్వేలో ప్రతి రోజు రైళ్లు రద్దవుతున్నాయి. కొన్ని రైళ్లు డైవర్టు అవుతున్నాయి. మరికొన్ని రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. విశాఖ నుండి న్యూఢిల్లిd వెళ్లే ఎపి ఎక్స్‌ప్రెస్‌ సాధారణంగా రెండు గంటల ఆలస్యంగా నడుస్తుంది. ఇటీవల కాలంలో ఒక రోజు రాత్రి పది గంటలకు విశాఖలో బయల్దేరాల్సిన ఈ ఎక్సెప్రెస్‌ మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు బయల్దేరింది. అదే విధంగా మరి కొద్ది రోజుల త ర్వాత ఖాజీ పేట, విజయవాడ మీదుగా విశాఖ రావాల్సిన ఈ ట్రైన్‌ను దారి మళ్లించి నాగపూర్‌ నుంచి రాయపూర్‌, రాయగడ మీదగా విశాఖను డైవర్టు చేశారు.

దీంతో వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి లాంటి నగరాల్లో దిగాల్సిన ప్రయాణీకులు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ ఒక్క రైలు మాత్రమే కాదు అనేక ట్రైన్ల పరిస్థితి ఇలాగే ఉంది. ఈ గురువారం రాత్రినే 14 రైళ్లను రద్దు చేసినట్లు, మరికొన్నింటినీ డైవ ర్ట్‌ చేసినట్లు విజయవాడ డివిజనల్‌ కేంద్రం నుండి పత్రికా ప్రకటన వచ్చింది. ఇలా ప్రతిరోజూ జరుగుతోంది. ఈ రైళ్లను దృష్టిలో పెట్టుకొని ప్రయాణాలను ప్లాన్‌ చేసుకున్న వారు చాలా ఇబ్బంది పడ్తున్నారు. కొన్ని ట్రైన్ల డైవ ర్ట్‌ కారణంగా రైలు ప్రయాణం రద్దు చేసుకున్నప్పటికీ వారి టిక్కెట్‌ డబ్బులు తిరిగి వెనక్కి రావడం లేదు.

- Advertisement -

అవే లైన్లు…కానీ పెరిగిన ట్రైన్ల సంఖ్య…

విజయవాడ కేంద్రంగా గతంలో రోజుకు 180 ట్రైన్లు నడిచేవి. ఇప్పుడు అన్ని వైపులా కలిపినా అదే లైన్లు ఉన్నప్పటికీ 250 ట్రైన్లు నడుస్తున్నాయి. దీనికి తోడు గూడ్స్‌ ట్రైన్స్‌ కూడా ఉన్నాయి. ప్రతి ఏడాది ట్రైన్ల సంఖ్యను ఐదు నుంచి పది శాతం పెంచుకుంటూ పోతున్నారు. కానీ ఆ మేరకు మౌళిక వసతులు అంటే రైల్వే లైన్ల సంఖ్య అయితే పెరగలేదు. దీంతో రైళ్ల రాకపోకలు ఆలస్యమౌతున్నాయి. సామర్ధ్యానికి మించి లైన్ల మీద ట్రైన్లు నడుస్తుండడంతో ఒక్కొసారి కొన్ని ట్రైన్లను రద్దు చేయాల్సి వస్తోంది. ఈ కారణంగానే లైన్ల సంఖ్యను పెంచే పనిలో రైల్వే శాఖ ఉంది. ఇప్పటికే విజయవాడ నుండి నర్సాపూర్‌, విజయవాడ నుండి మచిలీపట్నం డబుల్‌ లైన్‌ పూర్తయింది. అయినప్పటికీ ఈ లైన్లలో నడిచే ట్రైన్లు వేగం తక్కువగానే ఉంది. కానీ ఛార్జీలు మాత్రం ఎక్స్‌ప్రెస్‌ రేంజ్‌లో వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు ప్రయాణీకుల నుండి వస్తున్నాయి.

మారిన విధానంతో మరిన్ని కష్టాలు..

లైన్ల సంఖ్యను పెం చే పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. విజయవాడ నుండి గూడురు మధ్య చాలా వరకు ట్రిపుల్‌ లైన్‌ పనులు పూర్తయ్యాయి. అయితే ఆంకా పూర్తి కావాల్సింది ఎక్కువగానే ఉంది. అలాగే విజయవాడ- దువ్వాడ మధ్య మూడో లైన్‌కు సంబంధించి సర్వే జరుగుతోంది. విజయవాడ-కొండపల్లి మద్య ఓ పది కిలోమీటర్లు మినహా మూడో లైన్‌ పని పూర్తయ్యింది. ఇక కొండ పల్లి నుండి ఖాజీపేట మధ్య మూడో లైన్‌ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. గతంలో లైన్ల విస్తరణకు సంబంధించిన పనులన్నీ రైళ్ల రాకపోకలకు పెద్దగా ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉండేవి. కాగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మౌళిక వసతుల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో డెడ్‌లైన్లు పెట్టి పని చేయిస్తున్నారు.

దీంతో ఆ నిర్ణీత తేదీలోపు లైన్ల పని పూర్తి కావాలంటే అనివార్యంగా కొన్ని ట్రైన్లను రద్దు చేయాల్సి వస్తోంది. మరికొన్ని ట్రైన్లను రద్దు చేయాల్సి ఉంటుంది. అసలకే ట్రైన్ల సంఖ్య పెరిగి ఆలస్యమవుతూఉంటే ఈ మారిన విధానంతో మరిన్ని ట్రైన్లు రద్దవుతున్నాయి. అయితే ఈ సమస్య మరో మూడేళ్ల పాటు ఉంటుం దని విజయవాడ ఎడిఆర్‌ఎం డి.శ్రీనివాసరావు తెలిపారు. మరో మూడేళ్ల తర్వాత రైల్వే మౌళిక వసతులు భాగా అభివృద్ది చెంది ప్రయాణీకులకు పూర్తి స్తాయిలో సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement