Monday, May 29, 2023

సీసీ కెమెరాలు తొల‌గించి.. పాఠ‌శాల‌లో క్షుద్ర పూజ‌లు

రంగారెడ్డి : సీసీ కెమెరాలు తొల‌గించి మ‌రీ క్షుద్ర పూజ‌ల‌కు పాల్పిన ఘ‌ట‌న రాజేంద్ర న‌గ‌ర్ లో క‌ల‌క‌లం రేపాయి. హైదర్ షాకోట్ లో ఓ పాఠశాలలో క్షుద్ర‌పూజ‌లు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. స్థానిక‌ జిల్లా పరిషత్ పాఠ‌శాల‌లో కొంద‌రు గుర్తు తెలియని దుండగులు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. పాఠశాల సైన్స్ లాబ్, స్టోర్ రూమ్ ఎదుట రెండు ప్రాంతాల్లో బొమ్మలు, పసుపు, కుంకుమ, గువ్వలు, మేకులు, నిమ్మకాయలను గుర్తించారు. వీటిని చూసి ఒక్కసారిగా విద్యార్థులు, ఉపాద్యాయులు భయభ్రాంతులకు గురయ్యారు. పాఠశాలలోని సీసీ కెమెరాలను మాయం చేసి మరీ క్షుద్ర పూజలు నిర్వహించడం గమనార్హం. పాఠ‌శాల ప‌రిస‌రాల్లో క్షుత్ర పూజ‌ల‌కు వినియోగించే సామ‌గ్రి క‌నిపించ‌డంతో స్థానికులు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement