Saturday, April 20, 2024

దేశంలో మొదటి మల్టి మోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌.. చెన్నయ్‌లో నిర్మించనున్న రిలయన్స్‌

దేశంలో మొదటి మల్టి మోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌ చెన్నయ్‌లో రానుంది. ఈ పార్క్‌ను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నిర్మించనుంది. ఈ పార్కుని 1,424 కోట్లతో 184 ఎకరాల్లో నిర్మించనుంది. మల్టి మోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌ను ప్రభుత్వం, ప్రైవేట్‌ భాగస్వామ్యంలో (పీపీపీ) నిర్మించనున్నారు. లాజిస్టిక్‌ పార్క్‌ను అనుసంధానం చేసేందుకు అవసరమైన మౌళిక సదుపాయలను కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో కూడిన ఒక స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌(ఎస్‌పీవీ)ని ఏర్పాటు చేస్తున్నట్లు తమిళనాడు రోడ్‌ ట్రాన్స్‌పోర్టు, హైవేస్‌ డిపార్ట్‌మెంట్‌ తెలిపింది.

మల్లి మోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌ను కలుపుతూ 104 కోట్లతో 5.4 కిలోమీటర్ల దూరం నాలుగు లైన్లతో నేషనల్‌ హై వేని నిర్మించనున్నారు. దీంతో పాటు 217 కోట్లతో 10.5 కిలోమీటర్ల దూరం రైల్వేలైన్‌ను కూడా నిర్మిస్తారు. ఈ ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న రిలయన్స్‌ తన సొంత వనరుల నుంచి 783 కోట్లు ఖర్చు చేయనుంది. రెండు సంవత్సరాల్లో ఈ పార్క్‌ మొదటి దశ పూర్తి చేయాల్సి ఉంది.

కొత్తగా నిర్మిస్తున్న మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌ చెన్నయ్‌ నగరానికి 52 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇన్నోరి పోర్టుకు 87 కిలోమీటర్ల దూరంలో, కాటుపల్లి ఎయిర్‌పోర్టుకు 87 కిలోమీటర్ల దూరంలో ఉం ది. ఇక్కడి నుంచి సంవత్సరానికి 7.17 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సరకు రవాణా అవుతుందని అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్‌ లాజిస్టిక్‌ పాలసీ కింద ఈ పార్క్‌ను నిర్మిస్తున్నారు. వచ్చే రెండు సంవత్సరాల్లో దేశంలో ఇలాంటి 15 లాజిస్టిక్‌ పార్క్‌లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement