Thursday, March 28, 2024

రీజనల్‌ రింగ్‌ రోడ్డు పనులు వేగవంతం.. ముమ్మరంగా భూ సేకరణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరానికి జిల్లాల నుంచి భారీ సంఖ్యలో వస్తున్న వాహనాలను నియంత్రించడం లక్ష్యంగా నిర్మిస్తున్న రీజనల్‌ రింగ్‌ రోడ్డు పనులు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా మేడ్చల్‌ జిల్లాలోని గౌరెల్లి నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మధ్య రోడ్డు నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ పనులు ఊపందుకున్నాయి. రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో భాగంగా గౌరెల్లి-వలిగొండ మధ్య దాదాపు 41 కి.మీ.ల మేర నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం జరగాల్సి ఉంది.

ఇందుకోసం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్‌ పోచంపల్లి మండలంలోని పోచంపల్లి, దంతూర్‌,ధర్మారెడ్డిపల్లి, జగత్‌పల్లి, పిల్లాయ్‌పల్లి, మెహర్‌నగర్‌, కనుముక్త, జూలూర్‌, వంకమామిడి, వలిగొండ మండలంలోని వలిగొండ, మల్లేపల్లి, ప్రొద్దటూరు, రెడ్డ రేపాక, సంగెం గ్రామాల్లో భూ సేకరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

- Advertisement -

మరోవైపు, కొన్ని గ్రామాల్లో భూ సేకరణకు సంబంధించి యజమానుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ భూమిని రోడ్డు నిర్మాణానికి ఇవ్వడానికి రైతులు ముందుకు రావడం లేదు. దీంతో పాటు ఈ భూములకు మార్కెట్‌ రేటు ఒక విధంగా ఉండగా, ప్రభుత్వం అతి తక్కువ ధరను నష్టపరిహారంగా ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement