Sunday, December 3, 2023

ఇండియన్ మార్కెట్ లో రెడ్‌మీ నోట్‌ 12 అమ్మకాల జోరు..

రెడ్‌ మీ నోట్‌ సిరీస్‌ ఫోన్లకు భారతీయ మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఇటీవల విడుదల చేసిన నోట్‌ 12- 5జీ సిరీస్‌ కొత్త మోడల్‌ అమ్మకాల రికార్డులను తిరగరాస్తోంది. మార్కెట్‌లోకి విడుదలైన తొలి వారంలోనే రూ.300 కోట్ల విలువైన అమ్మకాలు జరిగినట్లు రెడ్‌మీ ఇండియా తెలిపింది. భారత మార్కెట్లో రెడ్‌మీ ఫోన్లకు దక్కుతున్న ఆదరణకు ఈ విక్రయాలే నిదర్శనమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

- Advertisement -
   

ఇండియా విపణిలో రెడ్‌మీ నోట్‌ 8 ఏళ్లు పూర్తిచేసుకుంది. నోట్‌ 12.. 5జీ సిరీస్‌ ప్రకటన తర్వాత దీనికోసం దాదాపు 80 లక్షల మంది ఆన్‌లైన్‌లో సెర్చింగ్‌ చేశారు. విడుదలైన వారంలోనే రూ.300కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి. వినియోగదారులకు తక్కువ ధరలో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌తో మెరుగైన ఉత్పత్తులు అందివ్వడమే మా లక్ష్యం అని షావోమి ఇండియా చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ అనూజ్‌ శర్మ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement