Thursday, April 25, 2024

చైనాలో రెడ్‌ అలర్ట్‌.. వెలుగులోకి మరో కొత్త వైరస్‌, 35 కేసులు నమోదు

ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా మహమ్మారి నుంచి ఇంకా బయటపడలేదు. కరోనాకు పుట్టినిల్లు చైనాలో తాజాగా మరో వైరస్‌ వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. ‘లాంగ్యా హెనిపా’ అనే వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సోకుతున్నట్లుగా గుర్తించారు. ఇప్పటికే 35 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒకరి నుంచి మరొకరికి సోకిందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని అధికారులు తెలిపారు. జంతువుల నుంచే సోకి ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

లాంగ్యా హెనిపా వైరస్‌ సోకిన వారిలో ప్రధానంగా జ్వరం, దగ్గు, తలనొప్పి, వాంతులు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వీటితోపాటే ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పడిపోవడం, కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు తెలిపారు. లాంగ్యా హెనిపా వైరస్‌ కేసులు చైనాలోని హెనాన్‌, షాంగ్‌ డాంగ్‌ ప్రావిన్స్‌ల్లో నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement