Monday, June 5, 2023

మూడు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. భారీ వర్షాలకు అవకాశం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలోని మూడు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. .

- Advertisement -
   

రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటినుంచి భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదివారం తేలికపాటినుంచి మోస్తారు వర్షాలు కురవగా, సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్తాయని తెలిపింది. ఈ సమయంలో గంటకు 30నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement