Wednesday, October 9, 2024

పచ్చబొట్ల గిన్నిస్‌ రికార్డు.. యూకే పౌరుడి ఘనత, ఒంటిపై 600కిపైగా టాటూలు

శరీరంపై టాటూ డిజైన్ల సంస్కృతి ఇప్పుడు అంతటా సర్వసాధారణమైంది. చిన్న పిల్లల్నుంచి, పెద్దల దాకా ప్రతి ఒక్కరూ టాటూలపై మక్కువ పెంచుకుంటున్నారు. ఎక్కడో ఒకటీ.. అరా టాటూలైతే ఫరవాలేదు. కానీ, ఎక్కడబడితే అక్కడ ఒళ్లంతా పచ్చబొట్లతో కనిపించడం ఫ్యాషన్‌గా మార్చుకున్నారు. తాజాగా యూకేకి చెందిన ఓ వ్యక్తి టాటూల పిచ్చితో ఒళ్లంతా పచ్చబొట్లు పొడిపించుకున్నాడు. తన కుమార్తెపై ఉన్న ప్రేమని పచ్చబొట్టు రూపంలో ప్రదర్శించుకున్నాడు.

ఇదికాస్తా ఆయన్ను గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో చేర్చింది. యూకే కి చెందిన 49 ఏళ్ల మార్క్‌ ఓవెన్‌ ఎవాన్స్‌కు తన కూతురంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే తన కుమార్తె లూసీ పేరును ఒంటిపై 667 సార్లు పచ్చబొట్లుగా వేయించుకుని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించాడు. ఎవాన్స్‌ 2017లోనే తొలిసారి వరల్డ్‌ రికార్డు నెలకొల్పాడు.

- Advertisement -

అప్పుడు కుమార్తె లూసీ పేరును తన వీపుపై 267 సార్లు టాటూలుగా వేయించుకున్నాడు. అయితే, ఆ రికార్డు 2020లో బద్దలైంది. అమెరికన్‌ డైడ్రా విజిల్‌ అనే మ#హళ తన పేరును 300 సార్లు టాటూ వేయించుకుని కొత్త రికార్డును నెలకొల్పింది. ఇది తెలుసుకున్న ఎవాన్స్‌.. డైడ్రా రికార్డును బద్దలు కొట్టాలనుకున్నాడు.

ఈ క్రమంలోనే తన కూతురి పేరును 400 సార్లు టాటూ వేయించుకున్నాడు. అయితే, ఈ సారి రెండు తొడలపై మొత్తం 400 టాటూలు వేయించుకున్నాడు. దీంతో గతంలో వేయించుకున్న 267 టాటూలు, ఈ 400 కలిపి మొత్తం ఎవాన్స్‌ శరీరంపై 667 టాటూలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement