Wednesday, April 24, 2024

అయ్య బాబోయ్… ఎకరం భూమి రూ.55 కోట్లు

హైదరాబాద్: గురువారం నాడు కోకాపేటలో 45 ఎకరాల ప్రభుత్వ భూములను వేలం వేసిన తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఖానామెట్‌లో భూములను వేలం వేసింది. ఈ మేరకు 15 ఎకరాల్లోని 5 ప్లాట్లకు వేలం నిర్వహించారు. అత్యధికంగా ఒక ఎకరం రూ.55 కోట్లు, సగటున ఒక్కో ఎకరం రూ.48.92 కోట్లు పలికింది. భూముల అమ్మకం ద్వారా ప్రభుత్వానికి రూ.729.41 కోట్ల ఆదాయం సమకూరింది. లింక్‌వెల్ టెలీ సిస్టమ్స్, GVPR ఇంజినీర్స్, మంజీరా కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలు భూములను దక్కించుకున్నాయి.

కాగా కోకాపేట, ఖానామెట్ భూముల వేలంతో తెలంగాణ ప్రభుత్వానికి రూ.2,729 కోట్ల ఆదాయం లభించడం విశేషం. కోకాపేట శివారులో త్వరలో ఐటీ హబ్ రానున్న సంగతి తెలిసిందే.

ఈ వార్త కూడా చదవండి: తెలంగాణ కేబినెట్‌లో సగం మంది టీడీపీ వారే

Advertisement

తాజా వార్తలు

Advertisement