Saturday, April 20, 2024

మొద‌లైన రియల్ మీ ప్యాడ్ మినీ విక్రయాలు.. ఆకర్షణీయమైన ధరలోనే..

రియల్ మీ ప్యాడ్ మినీ (ఆండ్రాయిడ్) విక్రయాలు మొదటిసారిగా సోమవారం మధ్యాహ్నం మొదలయ్యాయి. ఫ్లిప్ కార్ట్, రియల్ మీ ఆన్ లైన్ స్టోర్లలో మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయాలు మొదలయ్యాయి. ఆఫ్ లైన్ స్టోర్లలోనూ ఇవి ల‌భించనున్నాయి. మొదటి సారి విక్రయాల్లో కొనుగోలుదారులకు రూ.2,000 తగ్గింపును రియల్ మీ ఆఫర్ చేస్తోంది. పిల్లల ఆన్ లైన్ పాఠాల కోసం, వీడియోలను చూడ్డానికి ఈ రియల్ మీ ప్యాడ్ మినీ ఆకర్షణీయంగా ఉంటుంది. వైఫై, ఎల్టీఈని సపోర్ట్ చేసే రకాలు ఇందులో ఉన్నాయి. వైఫైపై పనిచేసే 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ ధర రూ.10,999. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ ధర రూ.12,999. అదే ఎల్టీఈ వేరియంట్ 3జీబీ, 32జీబీ ధర రూ.12,999. 4జీబీ, 64జీబీ వేరియంట్ ధర రూ.14,999. బ్లూ, గ్రే రంగుల్లో ఇవి లభిస్తాయి.

రియల్ మీ ప్యాడ్ కంటే ప్యాడ్ మినీ కొంచెం చిన్నదిగా పట్టుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. సైజులోనే కాదు, పనితీరులోనూ రియల్ మీ ప్యాడ్ తో పోలిస్తే కాస్త తక్కువగానే ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇందులో 6,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18 వాట్ ఫాస్ట్ చార్జర్ కు సపోర్ట్ చేస్తుంది. 16 గంటల పాటు వీడియోలను స్ట్రీమింగ్ చేసుకోవచ్చని రియల్ మీ ప్రకటించింది. విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని దీన్ని తీసుకొచ్చినట్టు రియల్ మీ సంస్థ ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement