Tuesday, September 26, 2023

RCB అన్‌బాక్స్ ఈవెంట్‌.. కొత్త జెర్సీని ఆవిష్కరించిన టీమ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) 16వ ఎడిషన్‌కు కేవలం ఐదు రోజులే మిగిలి ఉండగా.. బెంగళూరు చిన్నస్వామీ స్టేడియంలో జరిగిన RCB అన్‌బాక్స్ ఈవెంట్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. జెర్సీ లాంచ్ సమయంలో విరాట్ కోహ్లీతో పాటు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ కూడా ఉన్నారు. దీంతో పాటు రాబోయే సీజన్‌కు తమ ప్రధాన స్పాన్సర్‌గా ఖతార్ ఎయిర్‌వేస్‌ ఉండనున్నట్టు ఫ్రాంచైజీ ప్రకటించింది. అయితే, కొత్తగా ఆవిష్కరించిన జెర్సీ మీద కొన్ని ప్యాటర్న్స్ చేంజ్ చేశారు. అంతకు మించి పెద్ద మార్పులు ఏవీ లేవు. అయితే, టీ షర్ట్ పై లోగో గోల్డెన్ కలర్‌లో ఉండగా, ట్రాక్ ప్యాంట్ రెడ్ కలర్ లో ఉంటుంది.

- Advertisement -
   

క్రిస్ గేల్, ABలను సత్కరించిన RCB..

RCB చరిత్రలో తమ ఫ్రాంచైజీ తరుఫున ఆడిన ఇద్దరు గొప్ప ఆటగాల్లను సత్కరించింది. క్రిస్ గేల్, AB డివిలియర్స్ RCB హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించారు. అంతే కాకుండా, వారి గౌరవార్ధంగా వాల్ల జర్సీలకు పర్మినెంట్ గా రిటైర్మెంట్ ప్రకటించింది. ఆ తరువాత ఈ ఇద్దరు క్రికెటర్లతో పాటు మొత్తం జట్టు, సహాయక సిబ్బంది చిన్నస్వామి స్టేడియంలో అక్కడ ఉన్న అభిమానులను పలకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement