Friday, April 19, 2024

వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం

ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.35 వద్ద కొనసాగనున్నట్లు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ ప్రకటించారు. కీలక వడ్డీ రేట్లు సహా ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను సమీక్షించేందుకు.. ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ నేతృత్వంలో ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) బుధవారం భేటీ అయ్యింది. మూడు రోజుల సమీక్ష అనంతరం కమిటీ తీసుకున్న నిర్ణయాలను దాస్​ శుక్రవారం వెల్లడించారు. ఇన్‌స్టాంట్ ఫండ్ ట్రాన్సుఫర్ ఇమ్మిడీయేట్ పేమెంట్ సర్వీసెస్(IMPS) ట్రాన్సాక్షన్ పరిమితిని రూ.2 లక్షల నుండి రూ.5 లక్షల వరకు పెంచాలని ప్రతిపాదన చేసినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. దేశంలో 40 శాతం ఆర్థిక కార్యకలాపాలకు దోహదపడే కాంటాక్ట్ ఇంటెన్సివ్ సర్వీసెస్ ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయని చెప్పారు. సరఫరా వైపు, ఖర్చు ఒత్తిడి ద్రవ్యోల్భణంపై ప్రభావం చూపుతోందన్నారు.

ఇది కూడా చదవండి: ఆల్ టైమ్ హైకి చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నేటి రేట్లు ఇలా..

Advertisement

తాజా వార్తలు

Advertisement