Thursday, April 25, 2024

సీత‌ను తీసుకెళ్లాలంటే ఈ రావ‌ణాసురుడిని దాటాలి…

మాస్‌రాజా తాజాగా న‌టిస్తున్న‌మూవీ ‘రావణాసుర’ . సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై టైటిల్‌ పోస్టర్‌ నుండే ప్రేక్షకులలో ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. తాజాగా మేకర్స్‌ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు. టీజర్ చూస్తే ఓ క్రిమినల్‌ గురించి పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ చేసే వేట ఇదని స్పష్టమవుతుంది. యాక్షన్‌ బ్లాక్స్‌తో టీజర్‌ అదిరిపోయింది. ఇప్పటి వరకు రవితేజ చేయని పాత్ర ఇదని తెలుస్తుంది. సుశాంత్‌కు కూడా ఈ సినిమాలో న‌టిస్తున్నాడు.టీజ‌ర్ కు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ఇచ్చిన‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ అదిరింది… ఇక టీజర్‌ లాస్ట్‌లో సీతను తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు. ఈ రావణాసురుడిని దాటి వెళ్లాలి అంటూ రవితేజ చెప్పే డైలాగ్‌ ఆసక్తిని పెంచుతుంది. ర‌వితేజ‌కు జోడీగా అను ఇమాన్యూయేల్‌, మేఘా ఆకాశ్‌, ఫ‌రియా అబ్దుల్లాలు న‌టిస్తున్నారు. అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి ర‌వితేజ ఆర్‌టీ టీం వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్‌ 7న రిలీజ్ కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement