Wednesday, April 17, 2024

ర‌వితేజ పుట్టిన‌రోజు.. రావ‌ణాసుర గ్లింప్స్ రిలీజ్

నేడు హీరో ర‌వితేజ పుట్టిన‌రోజు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తోన్న రావ‌ణాసుర చిత్రం నుండి గ్లింప్స్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్. సుధీర్ వర్మ దర్శకత్వంలోఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రం షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాలో రవితేజ సరసన ఏకంగా 5 గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అనూ ఇమ్మాన్యూయేల్, మేఘా ఆకాష్, ఫరీయా అబ్దుల్లా, దీక్షా నగార్కర్, పూజిత పొన్నాడ నటించారు. ఈ చిత్రంలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించబోతున్నారు. హీరో సుశాంత్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్జి టీం వర్క్స్ బ్యానర్స్ పై సినిమా నిర్మితమౌతుంది.హర్షవర్ధన్ రామేశ్వర్, బీమ్స్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఏప్రిల్ ఏడో తేదీన 2023లో ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement