Saturday, April 20, 2024

పవనే సీఎం అవ్వాలి.. రత్నప్రభ యూటర్న్!

ఏపీ సీఎం అభ్యర్థి పవన్ కాదంటూ తాను చేసిన వ్యాఖ్యలపై తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ యూటర్న్ తీసుకున్నారు. ఏపీకి పవన్ కల్యాణే ముఖ్యమంత్రి కావాలని తాను భావిస్తున్నట్లు రత్నప్రభ చెప్పారు. సీఎం అభ్యర్థి విషయంలో పవన్ పై రత్నప్రభ చేసిన వ్యాఖ్యలు దూమారం రేపిన సంగతి తెలిసిందే. ‘జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్ధి కాదు, మీడియాలో ఎందుకు అలా ప్రచారం జరుగుతుందో తెలియదు’ అన్న రత్నప్రభ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై జనసేన నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ పవన్ తిరుపతిలో ప్రచారం చేయనున్న వేళ.. తన వ్యాఖ్యలపై రత్నప్రభ వివరణ ఇచ్చారు.

తమ కుటుంబాల కోసం నడిపే టీడీపీ, వైసీపీల అవినీతి, అరాచక పరిపాలనకు విసిగిపోయిన ఆంధ్ర ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఆశగా ఎదరు చూస్తున్నారని అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చగల పవన్ కల్యాణే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నానని రత్నప్రభ చెప్పారు.

కాగా, నిన్న ఇండియా ఎహెడ్ ఛానల్ లో నిర్వహించిన డిబేట్ లో మాట్లాడిన రత్నప్రభ… జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్ధి కాదని, మీడియాలో ఎందుకు అలా ప్రచారం జరుగుతుందో తెలియదని వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement