Tuesday, April 23, 2024

ర‌ష్మిక‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. న్యూ ఇయ‌ర్ వేడుక‌లు క‌లిసే చేసుకున్నారా..!

రీసెంట్ గా హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌..ర‌ష్మిక మంద‌న డేటింగ్ లో ఉన్నార‌న్న రూమ‌ర్స్ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మరోవైపు వీరి ప్రేమ కహానీకి కొన్ని హింట్స్ కూడా ఇస్తున్నట్టు అనిపిస్తోంది. ఇప్పటికే బెంగళూరులోని ఓ రీసార్ట్ లో కలిశారని, పలు హోటళ్లకు కలిసే వెళ్తున్నారంటూ పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత గతేడాది చివరిలో మాల్దీవులకు వేకేషన్ కోసం వెళ్లారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. పొగలేనిదే మంట రాదనట్టు వీరి మధ్య లవ్ ట్రాక్ లేనిదే ఇంతలా రూమర్లు ఎందుకొస్తాయని అంటున్నారు. తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కలిసే చేసుకున్నారంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

న్యూ ఇయర్ సందర్భంగా రష్మిక మందన్న తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో లైవ్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా తన అభిమానులకు విషెస్ తెలిసింది. లైవ్ సెషన్‌లో తన అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వచ్చింది. అదే సమయంలో రష్మిక వాయిస్ తో పాటు విజయ్ దేవరకొండ వాయిస్ కూడా వినిపిస్తుందని అభిమానులు, నెటిజన్లు అంటున్నారు. సంబంధించిన వీడియోను నెట్టింట వైరల్ చేస్తున్నారు. దీంతో వీరిద్దరూ న్యూ ఇయర్ కలిసే సెలబ్రేట్ చేసుకున్నారని అభిప్రాయపడుతున్నారు. గతేడాది మాల్దీవులకు వెళ్లినప్పుడు కూడా విజయ్, రష్మిక పంచుకున్న కొన్ని ఫొటోలు, అక్కడి వెదర్ వీరిద్దరూ కలిసే ఉన్నట్టు చెబుతున్నాయి. ఆ పిక్స్ కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement