Sunday, April 14, 2024

పెళ్లికూతురిగా ర‌ష్మిక‌.. పెళ్లి కొడుకుగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. వైర‌ల్ గా ఫొటో

అత్య‌ధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుని తారాస్థాయికి చేరుకున్నారు న‌టులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌..ర‌ష్మిక మంద‌న్న‌. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న కలిసి నటించారు. గీతాగోవిందంలో వీరిద్దరి కెమిస్ట్రీకి ఆడియెన్స్ ఫుల్ ఫిదా అయ్యారు. రొమాన్స్ తోనూ అదరగొట్టడంతో విజయ్, రష్మిక ఆన్ స్క్రీన్ పైనే కాకుండా.. ఆఫ్ స్క్రీన్ లోనూ లవ్ ట్రాక్ కొనసాగిస్తున్నారంటూ అప్పటి నుంచే వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా మరోసారి వీరి పేర్లు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు గెటప్ లో విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న కలిసి ఉన్న ఫొటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోలను విజయ్ అభిమాని ఒకరు ఫొటోషాప్ చేసి నెట్టింట రిలీజ్ చేశాడు. ‘ఇది ఇప్పుడు ఎడిటింగే కావొచ్చు.. ఫ్యూచర్ లో నిజం కానుంది’ అంటూ విజయ్, రష్మిక లవ్ పై జోష్యం చెప్పారు. దాంతో మ‌రోసారి విజ‌య్..ర‌ష్మిక‌ల ప్రేమ‌పై చ‌ర్చ జ‌రుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement