Friday, April 19, 2024

రంగ‌స్థ‌ల కళాకారుల జీవ‌న చిత్రం రంగ‌మార్తాండ‌…

సీనియర్‌ దర్శకుడు కృష్ణవంశీ కొంత విరామం తర్వాత తీసిన సినిమా ‘రంగమార్తాండ’. ఇళయ రాజా సంగీతం అందించారు. ప్రకాష్‌ రాజ్‌, రమ్యకృ ష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రధారులు. మరాఠీలో విజయం సాధించిన ‘నట్‌సమ్రాట్‌’ చిత్రం ఆధారం గా ‘రంగమార్తాండ’ రీమేక్‌ చేస్తున్నారు. మార్చి 22న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.
ఇప్పటికే ‘రంగమార్తాండ’ ప్రివ్యూ షోలు చిత్ర పరిశ్రమలో పలువర్గాలు వీక్షించాయి. అందరూ ముక్తకంఠంతో సినిమా బావుందంటూ ప్రశంసించారు. రంగమార్తాండ చిత్ర కథనం రంగస్థల కళాకారుల జీవితాల చుట్టూ ఉంటుంది. ఇంకా ఈ చిత్రంలో రాహుల్‌ సిప్లిగంజ్‌, శివాని రాజశేఖర్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, అలీరెజ, అనసూయ నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement