Thursday, April 18, 2024

Gossips: దగ్గుబాటి రానా తండ్రి కాబోతున్నాడా.. సింగర్​ కనికా కపూర్​ కామెంట్స్​ వెనుక అర్థం ఏమిటి?

తెలుగు, తమిళ పరిశ్రమలో అద్భుతమైన నటనతో రాణిస్తున్నాడు దగ్గుబాటి రానా. అయితే.. ఈ మధ్య రానా త్వరలో తండ్రి కాబోతున్నాడనే పుకార్లు వచ్చాయి. 2020 ఆగస్టు 8వ తేదీన హైదరాబాద్‌లో మిహీకా బజాజ్‌ని రానా పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో వారు తమ మొదటి బిడ్డను కనబోతున్నట్టు గాసిప్స్​ గుప్పుమంటున్నాయి. కాగా, ఈ అందమైన జంట ఇంతకుముందు ఇట్లాంటి వార్తలను కొట్టిపారేసినప్పటికీ సింగర్​ కనికా కపూర్ నుంచి వచ్చిన కామెంట్స్​ని మాత్రం కాదనడం లేదు. కనికా కపూర్​ వారికి గ్రీటింగ్స్​ చెబుతూ ఆసక్తికరమైన కామెంట్స్​ చేస్తూ వారికి అభినందనలు తెలిపడమే దీనికి కారణంగా తెలుస్తోంది.

ఆ వార్తల్లో నిజం లేదన్న రానా..

కనికాకపూర్​ చేసిన ఈ స్వీట్​ కామెంట్స్​ని విని కాస్త ఇబ్బందిలో పడ్డ రానా, ఆ విషయాన్ని చాలా స్పోర్టివ్​గా తీసుకున్నారు. ఆ తర్వాత నవ్వుతూనే సమాధానం ఇచ్చారు. తన భార్య మిహీకా గర్భవతి కాదని, తాము పేరెంట్స్​ కాబోతున్నట్టు వస్తున్న పుకార్లలో నిజం లేదని కనికాతో చెప్పాడు. ఇదంతా ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో జరిగింది.  గతంలో (అక్టోబర్‌లో) ఈ జంట తమ మొదటి బిడ్డను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారనే పుకార్లు వచ్చాయి. అప్పటికి వారు ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఎట్లాంటి ప్రకటన చేయలేదు.  

- Advertisement -

రానా దగ్గుబాటి-మిహీకా బజాజ్ లవ్ స్టోరీ

రానా, మిహీకా బజాజ్ పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. వారు తమ సోషల్ మీడియాలో ఫొటోలను కూడా తొలగించారు. దీంతో వారిద్దరూ విడిపోతున్నారనే వార్తలు  వైరల్‌ అయ్యాయి. అయినా ఇవేవీ వారు పట్టించుకోలేదు. ఇక.. మిహీకా తన సోషల్ మీడియాలో రానాతో ఉన్న ఫొటోని పోస్ట్ చేసి ”2 ఆత్మలు, 2 వ్యక్తులు, 2 చేతులు, 1 వాగ్దానం. కలిసి ఒక శాశ్వతత్వం. ఈ రోజు, ప్రతిరోజూ ప్రేమను పంచుకుంటూనే.. వేడుక జరుపుకుంటాము. నువ్వు నన్ను బాగా చూసుకుంటావ” అని స్వీట్​ కామెంట్స్​ షేర్​ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement