Saturday, April 20, 2024

‘రామా రావు ఆన్‌ డ్యూటీ’ మాస్‌ ట్రైలర్ లోడింగ్‌..

మాస్‌ మహారాజా రవితేజ నటిస్తున్న ‘రామా రావు ఆన్‌ డ్యూటీ’ ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. శరత్‌ మండవ దర్శకత్వంలో సు ధాకర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ మాస్ ట్రైలర్ రిలీజ్ కి సిద్ధం అవుతుంది. త్వరలోనే ట్రైలర్‌ విడుదల చేయనున్నారు మేక‌ర్స్. దానికి సంబంధించిన ట్రైలర్‌ అనౌన్స్‌ మెంట్‌ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర నిర్మాత‌లు. అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్ లో రవితేజ క్లాస్‌ అండ్ స్టైలిష్‌గా ఆకట్టుకున్నారు.

ఈ సినిమాలో రవితేజ తహశీల్దార్‌గా కనిపించనున్నారు. 1995 నాటి నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో రజిషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. సత్యన్‌ సూర్యన్‌ ఐఎ స్‌సి సినిమాటోగ్రఫీ అందించగా, ప్రవీణ్‌ కెఎల్‌ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం సినిమాకి సంబంధించిన‌ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement