Saturday, April 20, 2024

రామ్ సేతు ట్రైల‌ర్-పురావ‌స్తు ప‌రిశోధ‌కుడిగా- అక్ష‌య్ కుమార్

పురావ‌స్తు ప‌రిశోధ‌కుడిగా క‌నిపించ‌నున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్.ఆయ‌న న‌టిస్తోన్న తాజా చిత్రం రామ్‌సేతు . అభిషేక్‌ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్‌ 25న విడుదల కానుంది. అక్షయ్‌కు జోడీగా జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, నుష్రత్‌ భారుచ్చా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అమెజాన్, లైకా సంస్థలతో కలిసి విక్రమ్ మల్హోత్రా, అరుణ భాటియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్‌డేట్‌లను ఇస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా మేకర్స్‌ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.లేటెస్ట్‌గా విడుద‌లైన ట్రైలర్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకంటుంది. రామ్‌సేతు బ్రిడ్జ్‌ను కాపాడటానికి అక్షయ్‌కుమార్‌ అండ్ బృందం చేసే సాహసాలు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్‌ పురావస్తు పరిశోధకుడిగా కనిపించనున్నారు. టాలీవుడ్‌ యంగ్‌ హీరో సత్యదేవ్‌ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement