Thursday, April 25, 2024

పవన్ కల్యాణ్ స్పీచ్ పై స్పందించిన ..రామ్ గోపాల్ వర్మ

పవర్ స్టార్ .. జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పీచ్‌పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. గత వందేళ్లలో తాను విన్న అత్యంత ప్రభావవంతమైన, అద్భుతమైన స్పీచ్ పవన్ కళ్యాణ్‌ది అన్నారు వర్మ.. జనసేనాని చెప్పే ధర్మం మనవాళ్లలో కొందరికి అర్థం కాదన్నారు. ఓ తీవ్రతతో గుండెల్లోకి చొచ్చుకుపోయేలా పవన్ కళ్యాణ్ మాటలు ఉన్నాయన్నారు. మంచి వాక్పటిమతో ఉన్న జనసేనాని స్పీచ్ ఎప్పుడూ జనాలను కదిలిస్తుందన్నారు. ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసుకునే వర్మ ఈసారి ఆయన్ను ప్రశంసించడంపై పవన్ ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తదుపరి సినిమా ప్రమోషన్ కోసం ఆయన ఇలా చేస్తున్నారేమో అని కొందరు కామెంట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement