Wednesday, March 29, 2023

డేంజ‌ర‌స్ గాళ్ల్ తో ఫోటోకి ఫోజులిచ్చిన.. రామ్ గోపాల్ వ‌ర్మ‌


డేంజ‌ర‌స్ గాళ్ల్ తో ఫొటోకి ఫోజులిచ్చాడు ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. డేంజరస్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో నైనా గంగూలీ .. అప్సరా రాణి లు నటించారు. పెద్ద ఎత్తున ఆ సినిమాను విడుదల చేశారు. కానీ జనాల్లో కొందరు మినహా డేంజరస్ సినిమాను పట్టించుకున్న దాఖలాలు లేవు. సినిమా ప్రమోషన్ లో భాగంగా వర్మ ఇంకా ఫొటోలు .. వీడియోలు షేర్ చేస్తూనే ఉన్నాడు. అందులో భాగంగానే ఈ ఫొటోను వర్మ షేర్ చేశాడు. డేంజరస్ గర్ల్ అప్సరా రాణి తో అన్నట్లుగా ఈ ఫొటోను షేర్ చేశాడు. వర్మ పై చేయి వేసి స్విమ్ సూట్ లో ముద్దుగుమ్మ అప్సర ఫొటోకు ఫోజ్ ఇచ్చిన తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందంతో పాటు మంచి ఫిజిక్ ఉన్న ముద్దుగుమ్మ అప్సర. ఈ అమ్మడితో ముందు ముందు వర్మ మరిన్ని సినిమాలు తీసే అవకాశాలు ఉన్నాయి. ఒక హీరోయిన్ వర్మకు నచ్చితే అంత సులభంగా వదిలి పెట్టడు. ఇప్పుడు ఆయన దృష్టిలో అప్సర రాణి ఒక అప్సరస. కనుక ఆమెకు వరుసగా ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాడు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement