Friday, April 19, 2024

లఖింపుర్‌ ఖేరి: ఉద్యమం తప్పదన్న రాకేశ్‌ తికాయత్‌

లఖింపుర్ ఖేరి సంఘటనలో మరణించిన రైతుల కుటుంబాలను కలిసేందుకు రాజకీయ నేతలు క్యూ కట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రియాంక వాద్రా, రాహుల్ గాంధీ, ఎంపీ సంజయ్ సింగ్‌తోపాటు చాలా మంది నాయకులు లఖింపుర్‌ను సందర్శించేందుకు యూపీ ప్రభుత్వం అనుమతించింది. దాంతో లఖింపుర్‌లో రాజకీయ ఘర్షణ వాతావరణం నెలకొన్నది. అందరికన్నా ముందుగా, రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్‌ తికాయత్‌ లశింపుర్‌ ఖేరీలో మరణించిన రైతు కుటుంబాలతో సమావేశమయ్యారు. అనంతరం, నిందితులపై చర్యలు తీసుకునేందుకు ఆరు రోజుల డెడ్‌లైన్‌ విధించారు.


‘ప్రభుత్వానికి ఆరు రోజుల సమయం ఇస్తున్నాం. ఆలోగా నిందితులపై చర్యలు తీసుకోవాలి. లేకపోతే మా నుంచి మరో ఉద్యమాన్ని చూడాల్సి వస్తుంది’ అని రైతు ఉద్యమ నాయకుడు, భారతీయ కిసాన్‌ యూనియన్‌ ఆర్గనైజేషన్‌ జాతీయ ప్రతినిధి రాకేశ్‌ తికాయత్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన లఖింపుర్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రమాదం చేసిన వారిని నరమాంస భక్షుకులని దుమ్మెత్తిపోశారు. కేంద్ర మంత్రి మండలి నుంచి అజయ్‌ మిశ్రను తొలగించాలని మోదీకి విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: ‘మా’ ఎన్నికలు: ప్రకాశ్ రాజ్ పై నటుడు సీవీఎల్ సంచలన వ్యాఖ్య

Advertisement

తాజా వార్తలు

Advertisement