Friday, April 19, 2024

సూప‌ర్ స్టార్ తో క‌లిసి న‌టిస్తున్న‌ క్రికెట్ లెజెండ్

లెజెండరీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌, సూపర్ స్టార్ రజనీకాత్‌. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న లాల్‌ సలాం లో కపిల్‌ దేవ్‌, రజనీకాంత్‌ కలిసి నటించనున్నారు. విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేస్తున్నారు. రజనీకాంత్ ఇందులో కీలక పాత్రలో నటిస్తుండం మెయిన్ హైలైట్‌. తాజాగా ఆయన తన ట్విట్టర్‌లో 1983లో తొలిసారి ఇండియాకు క్రికెట్ వరల్డ్ కప్‌ను సాధించిన పెట్టిన నాటి కెప్టెన్ కపిల్ దేవ్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.. ‘లెజెండ్రీ పర్సన్‌, మనం అందరం ఎంతో గౌరవించాల్సిన గొప్ప మనిషి కపిల్ దేవ్‌జీతో కలిసి పని చేయటాన్ని గౌరవంగా భావిస్తున్నాను. క్రికెట్ వరల్డ్‌కప్‌ను సాధించి మన భారతదేశం గర్వపడేలా చేశారాయన’ అంటూ కపిల్ దేవ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను షేర్ చేసుకున్నారు రజనీకాంత్‌.

https://twitter.com/rajinikanth/status/1659183964295401472

మరో వైపు కపిల్ దేవ్ సైతం రజనీకాంత్‌తో ఉన్న ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ ‘రజనీకాంత్‌గారితో కలిసి పని చేయటం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’ అని అన్నారు..
కాగా లాల్‌సలాం షూటింగ్ శరవేగంగా జరగుతోంది. ఈ కు ఏఆర్‌ రెహమాన్ సంగీతం,సినిమాగ్ర‌ఫీ విష్ణు రంగస్వామి , . ఎడిటర్‌గా ప్రవీణ్‌ భాస్కర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement