Sunday, March 12, 2023

మెదక్ కలెక్టర్ గా రాజర్షీ షా నియామ‌కం..

ఉమ్మడి మెదక్ బ్యూరో, జనవరి 31 (ప్రభ న్యూస్): మెదక్ కలెక్టర్ గా సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీస్) రాజర్షీ షా నియమితులయ్యారు. తెలంగాణ ప్రభుత్వం జి ఓ నెంబర్ 159 ద్వారా రాష్ట్రంలోని ఐ ఏ ఎస్ లను పలు స్థానాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 10-2-2020 న సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ గా నియమితులైన ఆయన విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవరించేవారు. ముక్కుసూటి తనంతో ఉన్నది ఉన్నట్లు చెప్పేవాడు. ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లాలోని స్థానిక సంస్థలను అభివృద్ధి బాట పట్టించారు.

- Advertisement -
   

పల్లె వెలుగు,పల్లె ప్రకృతి వనాల నిర్మాణం, వైకుంఠదామాల నిర్మాణం, క్రీడా ప్రాంగణాలు, ఉపాధిహామీ, రైతు వేదికలు ఇలా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా రాజర్షి షా నియమ నిబద్ధతతో ఆయా కార్యక్రమాలను విజయవంతం చేశారని చెప్పవచ్చు. రాజర్షి షా సంగారెడ్డి లో పనిచేసినంత కాలం వివిధ రహితుడుగానే నడుచుకున్నాడు. ఆయా గ్రామాల నుండి వచ్చే రైతులు, ప్రజల సమస్యలను తనను కలిసి విన్నవించుకోగానే వాటి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ద చూపేవారని తెలుస్తుంది. మొత్తానికి ఆయన ప్రమోషన్ మీద సంగారెడ్డి నుండి మెదక్ వెళ్లడం పై జిల్లా ఉద్యోగస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement