Friday, April 26, 2024

గ్రామీణ స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌న్‌-2023లో దేశంలోనే రాజన్న సిరిసిల్ల నెం.1

సిరిసిల్ల : గ్రామీణ స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌న్‌-2023 త్రైమాసిక ఫలితాల్లో దేశంలోనే రాజన్న సిరిసిల్ల మరోసారి మెరిసింది. ఫోర్త్ స్టార్ కేట‌గిరిలో తొలి స్థానంలో రాజ‌న్న సిరిసిల్ల జిల్లా నిలిచి రికార్డు సృష్టించింది. రెండో స్థానాన్ని మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్ జిల్లా సొంతం చేసుకోగా, మూడోస్థానంలో పెద్ద‌ప‌ల్లి జిల్లా నిలిచింది.

ఈ సంద‌ర్భంగా రాజన్న సిరిసిల్ల క‌లెక్ట‌ర్ అనురాగ్ జయంతి, జిల్లా అధికారులు, పంచాయ‌తీ సెక్ర‌ట‌రీలు, ఎంపీవోలు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు మంత్రి కేటీఆర్‌కు అభినంద‌న‌లు తెలిపారు. అలాగే త్రీ స్టార్ కేట‌గిరిలో ఒక‌టి, రెండు స్థానాల‌ను సిద్దిపేట, జ‌గిత్యాల జిల్లాలు ద‌క్కించుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement