Tuesday, March 26, 2024

ఇకపై ఫ్యాన్స్ క్లబ్‌గా రజనీకాంత్ రాజకీయ పార్టీ

సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఎన్నో ఆశలతో రాజకీయాల్లోకి అడుగుపెట్టడం కోసం పెట్టిన పార్టీని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల మ‌క్క‌ల్ మండ్రం నేత‌ల‌తో స‌మావేశం జ‌రిపి కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. దీంతో ఆయ‌న మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నార‌న్న ఊహాగానాలు వ‌చ్చాయి. ఈ రోజు మ‌రోసారి వారితో చెన్నైలోని స‌మావేశం జ‌రిపిన అనంత‌రం ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. “రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రావాలి అనుకున్నాను. కానీ అందుకు సరైన సమయం కుదరలేదు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు. అందువల్ల నేను విన్నవించుకుంటున్నాను. ఇకపై రజనీ మక్కల్ మంద్రం… అభిమానుల చారిటీ ఫోరమ్‌లా పనిచేస్తుంది. ఇది ప్రజలకు మేలు చేస్తుంది” అని రజనీకాంత్ తన స్టేట్‌మెంట్‌లో తెలిపారు. ప్రస్తుతానికి ఈ సంస్థలోని సెక్రెటరీలు, అసోసియేట్లు, డిప్యూటీ సెక్రెటరీలు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు… అందరూ పనిచేస్తూనే ఉంటారని రజనీ తెలిపారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో 50 వేల ఉద్యోగాల భర్తీకి సర్కార్ రంగం సిద్ధం..

Advertisement

తాజా వార్తలు

Advertisement