Friday, April 19, 2024

ఆర్.ఆర్.ఆర్ మూవీ వాయిదా.. అధికారికంగా ప్రకటించిన యూనిట్

ప్రపంచవ్యాప్తంగా ఆర్.ఆర్.ఆర్ మూవీ కోసం సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెరకెక్కించడంతో అంచ‌నాలు ఆక‌శాన్ని తాకుతున్నాయి. ఇందులో తొలిసారి ఇద్ద‌రు స్టార్ హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌లు న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్లు, పోస్ట‌ర్లు భారీ హైప్‌ను పెంచాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్‌డేట్ వచ్చింది.

ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు మూవీ యూనిట్ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పేర్కొంది. పోస్ట్ ప్రొడక్షన్ దాదాపు పూర్తయిందని.. కానీ విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. అయితే విడుదల తేదీని మాత్రం ఫైనల్ చేయలేదని.. త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. సాధ్యమైనంత త్వరలో సినిమాను విడుదల చేస్తామని… థియేటర్లలోనే విడుదల చేస్తామని పేర్కొంది. కాగా ఈ మూవీ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 13న విడుదల కావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement