Thursday, April 18, 2024

రాజ‌మౌళి అసాధ్యాన్ని సుసాధ్యం చేయ‌గ‌ల‌రు.. హీరో నాని

అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలరని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిని కొనియాడారు హీరో నాని. భారతీయ సినిమా అనగానే అందరూ దక్షిణాదిని చూసేలా రాజమౌళి చేశారని నాని చెప్పారు. షూటింగ్ సమయంలో ప్రతి సన్నివేశాన్ని ఎంతో పరిశీలిస్తారని, ఒక సీన్ ను వివరించే సమయంలో, దాన్ని రచించే సమయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారని చెప్పారు. ఎవరికీ రాని ఆలోచనలు రాజమౌళికి వస్తాయని, ఎవరూ చేయని పనులను ఆయన విజయవంతంగా పూర్తి చేస్తారని పొగడ్తల్లో ముంచెత్తారు. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు ఆస్కార్ వస్తుందని నాని అన్నారు. తెలుగు మాస్ పాట ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిందని, ఈ పాట ఆస్కార్ గెలుచుకుంటుందన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. భారతీయ సినిమాలు ప్రత్యేకమైనవని, అన్ని విధాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నాయని, ‘నాటు నాటు’ కేవలం ప్రారంభం మాత్రమేనని చెప్పారు.ద‌స‌రా మూవీ ప్ర‌మోష‌న్స్ లో బిజిగా ఉన్నాడు నాని.

Advertisement

తాజా వార్తలు

Advertisement